Tuesday, March 10, 2026
Homeసినిమా‘స్టాండప్‌ రాహుల్‌’ సాంగ్ విడుదల చేసిన విజ‌య్ దేవర‌కొండ

‘స్టాండప్‌ రాహుల్‌’ సాంగ్ విడుదల చేసిన విజ‌య్ దేవర‌కొండ

యంగ్‌ అండ్‌ ప్రామిసింగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ స్టాండప్‌ కమేడియన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘స్టాండప్‌ రాహుల్‌’. సాంటో మోహన్‌ వీరంకి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఫీల్‌ గుడ్‌ రొమాన్స్‌ కామెడీ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని డ్రీమ్‌ టౌన్‌ ప్రొడక్షన్స్, హైఫైవ్‌ పిక్చర్స్‌ పతాకాలపై నందకుమార్‌ అభినేని, భరత్‌ మగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన టీజర్‌ చాలా ఫ్రెష్‌గా ఉంటూ సినిమాపై ప్రేక్షకుల అంచనాలను పెంచేసింది. రాజ్‌ తరుణ్‌ సరసన వర్షా బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తోన్న‌ ఈ సినిమా నుండి ‘అలా ఇలా అనాలని’ సాంగ్‌ని క్రేజీ హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ రిలీజ్ చేసి చిత్ర యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్ తెలిపారు.

‘అలా ఇలా అనాల‌ని ఇలా ఎలా ఉందే..అవీ ఇవీ వినాల‌ని ఇవాల‌తోచిందే’ అంటూ సాగే ఈ పాట‌కు అనంత శ్రీ‌రామ్ సాహిత్యం అందించ‌గా స్వీకర్‌ అగస్తి స్వ‌ర‌ప‌రిచారు. స‌త్య యామిని, స్వీక‌ర్ అగ‌స్తి సంయుక్తంగా ఆల‌పించారు. ఈ పాట‌కు సోష‌ల్‌మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ‘వెన్నెల’ కిషోర్, మురళిశర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్‌ మరియు మధురిమ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: సాంటో మోహన్‌ వీరంకి, నిర్మాణ సంస్థలు : డ్రీమ్‌ టౌన్‌ ప్రొడక్షన్స్, హైఫైవ్‌ పిక్చర్స్‌, సమర్పణ: సిద్ధు ముద్ద, నిర్మాతలు : నంద్‌కుమార్‌ అబ్బినేని, భరత్‌ మగులూరి, సంగీతం : స్వీకర్‌ అగస్తి, సినిమాటోగ్రఫి : శ్రీరాజ్‌ రవీంద్రన్‌, ఎడిటర్‌ : రవితేజ గిరిజెల్ల, కొరియోగ్రాఫర్‌ : ఈశ్వర్‌ పెంటి, ఆర్ట్‌ : ఉదయ్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular