Wednesday, March 18, 2026
Homeసినిమా'ఈటీ' ట్రైల‌ర్ రిలీజ్ చేసిన‌ లైగర్

‘ఈటీ’ ట్రైల‌ర్ రిలీజ్ చేసిన‌ లైగర్

ET Trailer out: హీరో సూర్య తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘ET’.  పాండిరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ పతాకం పై కళానిధి మారన్ నిర్మించారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ  ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వెర్షన్ ను విడుదల చేస్తోంది. తమిళ వెర్షన్ తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం మార్చి 10, 2022న ఒకేసారి విడుదల కానుంది.

ఇటీవలే హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ET టీజర్ ను విడుదల చేశారు. పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియ‌చేశారు. `ఈ.టీ. తెలుగు ట్రైలర్ను ఆవిష్కరించినందుకు చాలా ఆనందంగా వుంది. నాకు ఇష్టమైన హీరో సూర్యకు ఈటీ.. `ఎవరికి తలవంచడు`చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని విజయ్ పోస్ట్ చేశాడు.

ఇతరుల ఆనందంలో ఆనందాన్ని చూడాలనుకునే సామాజిక పోరాట యోధుడిగా సూర్య నటించారు. అతని గాళ్ ఫ్రెండ్ గా ప్రియాంక అరుల్ మోహన్ బబ్లీగా ఉండే పాత్ర పోషించింది. సామరస్యంగా వున్న ఓ గ్రామాన్ని ఒక నేరస్థుడు, అతని ముఠా గ్రామంలోని మహిళలను లక్ష్యంగా చేసుకోవడంతో సామరస్యం దెబ్బతింటుంది. సామరస్యాన్ని తిరిగి తీసుకురావడానికి కథానాయకుడు ఎటువంటి చర్య తీసుకున్నాడనేది కథ  ప్రధాన ఇతివృత్తంగా రూపొందింది.

సూర్య ఇంటెన్సివ్, పవర్-ప్యాక్డ్ పాత్రను పోషించాడు. అతను కొన్ని సమయాల్లో ఫన్నీగా ఉంటాడు. అలాగే ప్రజలను రక్షించే విషయంలో దూకుడుగా ఉంటాడు. ప్రియాంక అరుల్ మోహన్ చాలా అందంగా కనిపించగా వినయ్ రాయ్ విలన్ గా  నటించాడు. డి ఇమ్మాన్ అందించిన నేపథ్య సంగీతం అన్ని అంశాలను ఎలివేషన్లను చేస్తుండగా, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ ఫస్ట్ క్లాస్ లో ఆకట్టుకుంటుంది. సత్యరాజ్, రాజ్ కిర‌ణ్‌, శరణ్య పొన్వణ్ణన్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular