Saturday, January 18, 2025
Homeసినిమా 'ఖుషి’ సినిమా షూటింగ్ పూర్తి

 ‘ఖుషి’ సినిమా షూటింగ్ పూర్తి

విజయ్ దేవరకొండ, సమంత నటిస్తున్న చిత్రం ఖుషి. పాన్ ఇండియా మూవీగా రాబోతోన్న ఈ చిత్రాన్ని శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డ  ఈ సినిమా షూటింగ్‌ను చకచకా చేస్తూ వచ్చిన చిత్రయూనిట్ ఇప్పుడు ఓ అప్ డేట్ ఇచ్చింది. షూటింగ్ పూర్తయిందని, అలానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా షూటింగ్‌కు సమాంతరంగా జరుపుతూ వచ్చామని ఇప్పటికే 70శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు.

ఇప్పటికే హిషామ్ అబ్దుల్ వాహబ్ అందించిన రెండు పాటలు సోషల్ మీడియాలో శ్రోతలను అలరిస్తున్నాయి. ప్రేమికులంతా పాడుకునేలా రొమాంటిక్, మెలోడీ పాటలను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ వాటితో అందరినీ ఆకట్టుకుంది. సెప్టెంబర్ 1న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు. విజయ్ దేవరకొండ, సమంత, శివ నిర్వాణ.. ఈ ముగ్గురికీ ఈ సినిమా విజయం కీలకం. అందుచేత ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి.. ఖుషి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్