Saturday, January 18, 2025
HomeసినిమాKushi : ఖుషి సెన్సార్ పూర్తి.. ర‌న్‌టైం ఎంతంటే..?

Kushi : ఖుషి సెన్సార్ పూర్తి.. ర‌న్‌టైం ఎంతంటే..?

విజయ్ దేవరకొండ హీరోగా న‌టిస్తున్న చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్‌. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 1న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

తాజాగా ఈ మూవీ సెన్సార్​ పనులను పూర్తి చేసుకుంది. ‘యు/ఏ’ సర్టిఫికెట్​ను అందుకుంది. పెద్దలతో పాటు పిల్లలు కూడా సినిమా చూడొచ్చు అన్నమాట. ఇంకా ఈ సినిమా రన్ టైమ్ 165 నిమిషాలు అని సెన్సార్​ తెలిపింది. అంటే… రెండు గంటల 45 నిమిషాలు అన్నమాట. మూడు గంటలకు పావు గంట తక్కువ.

అయితే సెన్సార్​ నుంచి పాజిటివ్ రెస్పాన్స్​ వచ్చిన ఈ చిత్రంలో ఎంటర్​టైన్మెంట్​, ఫ్యామిలీ ఎమోషన్స్​, డ్రామా బాగా పండాయని సెన్సార్ బోర్డుకు చెందిన వర్గాలు తెలిపాయి. ఆరేళ్ల నుంచి 60ఏళ్ల వరకు ఆడియెన్స్(పెళ్లి కానీ వారు, పెళ్లైన వారు) వరకు ​ చూడదగ్గ సినిమా అని ఇప్పటికే దర్శకుడు శివ నిర్వాణ చెప్పిన సంగతి తెలిసిందే.

ఇకపోతే ఇప్పటికే రిలీజైన పోస్టర్స్​, సాంగ్స్, ట్రైలర్​లో విజయ్ దేవరకొండ, సమంత ల కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రతి సాంగ్​ చార్ట్ బస్టర్​గా నిలిచింది. సోషల్​మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. హేషామ్ అబ్దుల్ వహాబ్​ అందించిన సంగీతం బాగా ఆకట్టుకుంది. సినిమాలో జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదతరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్