Sunday, January 19, 2025
HomeసినిమాKushi: విజయ్ దేవరకొండ 'ఖుషి' అయ్యేనా? 

Kushi: విజయ్ దేవరకొండ ‘ఖుషి’ అయ్యేనా? 

ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నిలదొక్కుకున్నవారి సంఖ్య చాలా తక్కువ. అలాంటి హీరోల జాబితాలో మనకి విజయ్ దేవరకొండ కూడా కనిపిస్తాడు. సాధారణంగా ఇండస్త్రీకి వచ్చిన తరువాత హీరోగా అవకాశాలను దక్కించుకోవడానికీ .. స్టార్ డమ్ సంపాదించుకోవడానికి చాలా సమయం పడుతూ ఉంటుంది. అలాంటిది విజయ్ దేవరకొండ యూత్ లోకి ఒక్కసారిగా దూసుకుపోయాడు. ఆ తరువాత పడిన హిట్స్ తో స్టార్ డమ్ ను అందుకున్నాడు.

అయితే విజయ్ దేవరకొండకి ఎలా వరుస హిట్లు పడుతూ వచ్చాయో, అదే స్థాయిలో ఫ్లాపులు పడుతూ వచ్చాయి. ‘డియర్ కామ్రేడ్’ .. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫ్లాపులతో ఉన్న విజయ్ దేవరకొండ, ‘లైగర్’ సినిమాలతో ఆ ఫ్లాపుల నుంచి బయటపడొచ్చని అనుకున్నాడు. కానీ ఆ సినిమా ఆయనకి పాన్ ఇండియా స్థాయిలో పరాజయాన్ని తెచ్చిపెట్టింది. ఆయన కెరియర్ లో ఇదే పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. దాంతో ఆయనతో పాటు అభిమానులంతా కూడా నిరాశా నిస్పృహలకు లోనయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన చేతికి ‘ఖుషి‘ దొరికింది.

విజయ్ దేవరకొండ – సమంత జంటగా, శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించాడు. ఇది ఒక విభిన్నమైన ప్రేమకథ అని ఆయన చెప్పాడు. సమంత చాలా సీనియర్ హీరోయిన్ .. విజయ్ దేవరకొండ ఆమె తరువాత చాలా కాలానికి ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఇద్దరి మధ్య లవ్ ఏంటి? అని అభిమానులు అనుకున్నారు. అయితే అందుకు తగినట్టుగానే ఈ కథ ఉంటుందని మేకర్స్ అంటున్నారు. ఈ సినిమా తప్పకుండా హిట్ కొట్టవలసిన అవసరం విజయ్ కి ఉంది. సెప్టెంబర్ 1న విడుదలవుతున్న ఈ సినిమాతో, ఆయన .. ఆయన అభిమానులు ‘ఖుషి’ అవుతారా అనేది చూడాలి.

Also Read: ‘ఖుషి’ సినిమా నుండి ఐదో పాట ఓసి పెళ్లామా..రిలీజ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్