Saturday, January 18, 2025
Homeసినిమామంచి డేట్ సెట్ చేసుకున్న 'మహారాజ'

మంచి డేట్ సెట్ చేసుకున్న ‘మహారాజ’

ఈ వేసవిలో థియేటర్లు వెలవెలబోయాయనే చెప్పాలి. చాలా తక్కువ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో వీకెండ్ వరకూ థియేటర్లలో నిలబడినవి చాలా తక్కువ. ఇక ఈ వారం విషయానికి వస్తే ఓ నాలుగు సినిమాలు థియేటర్లలో దిగిపోవడానికి రెడీ అవుతున్నాయి. వాటిలో శర్వానంద్ ‘మనమే’ సినిమాపైనే కాస్త బజ్ ఉంది. చాలా గ్యాప్ తరువాత శర్వా – కృతి శెట్టి తెలుగు తెరపై కనిపించే సినిమా ఇది. ఇద్దరికీ కూడా హిట్ చాలా అవసరమే.

ఇక ఈ వారం వచ్చే మిగతా మూడు సినిమాలపై అంతగా బజ్ లేదు. ఆ తరువాత వారం పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఉండటానికి ఒక మూడు నాలుగు సినిమాలు బరిలో ఉన్నాయి. కానీ ఏ సినిమా కూడా ఆసక్తికరంగా మాట్లాడుకునే స్థాయిలో కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక తమిళ సినిమా గురించిన టాక్ మాత్రం వినిపిస్తోంది. ఆ సినిమా పేరే ‘మహారాజ’. విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన సినిమా ఇది.

తమిళంతో పాటు తెలుగులోను అదే రోజున ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. కోలీవుడ్ వైపు నుంచి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన స్టార్ లలో విజయ్ సేతుపతి ఒకరు. ఇక్కడ ఆయన సినిమాలకి మంచి మార్కెట్ ఉంది. ఇక నిన్ననే ఈ సినిమా నుంచి ట్రైలర్ ను కూడా వదిలారు. ‘సార్ .. నా లక్ష్మి కనిపించడం లేదు .. కొంచెం వెతికి పెట్టండి’ అంటూ హీరో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, పోలీసులు అతని ప్రవర్తనను అనుమానించడాన్ని హైలైట్ చేశారు. సినిమాపై ఉత్కంఠ పెరిగేలా చేశారు. వచ్చేవారం జాబితాలో, ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న సినిమాగా ‘మహారాజ’ కనిపిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్