Wednesday, March 11, 2026
Homeసినిమామరో తెలుగు సినిమా ఒప్పుకున్న విజయ్ సేతుపతి!

మరో తెలుగు సినిమా ఒప్పుకున్న విజయ్ సేతుపతి!

విజయ్ సేతుపతి కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లకి పైగా అయింది. తమిళంలో చాలా చిన్న చిన్న పాత్రలతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన, ఇప్పుడు అక్కడ తిరుగులేని స్టార్. తమిళంలోనే కాదు .. టాలీవుడ్ .. బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తూ వెళుతున్నాడు. కొన్ని తమిళ అనువాదాల కారణంగా ఇక్కడ పరిచయమైన విజయ్ సేతుపతి, ‘ఉప్పెన’ సినిమాలో విలన్ గా ఇక్కడి ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఆ తరువాత మరికొన్ని సినిమాలలో తన స్థాయికి తగిన రోల్స్ చేస్తూ వెళ్లాడు.

ఈ నేపథ్యంలోనే ఆయన మరో తెలుగు సినిమాను అంగీకరించినట్టుగా వార్తలు వస్తున్నాయి. కల్యాణ్ రామ్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం కొంత కాలంగా అన్వేషణ సాగుతోంది. తాజాగా విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. ఈ పాత్రకి ఆయనే కరెక్టు అంటున్నారు.

విజయ్ సేతుపతికి మాస్ ఇమేజ్ ఎక్కువ. మాస్ రోల్స్ లో ఆయనను చూడటానికి అభిమానులు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఆయన కూడా ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేయడు. కథ .. పాత్ర తనకి నచ్చితేనే తప్ప ఒప్పుకోడు. అలాంటి ఆయన కల్యాణ్ రామ్ సినిమాను అంగీకరించాడని అంటే, అందులో ఏదో కొత్తదనం ఉందనే అనుకోవాలి. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. త్వరలోనే ఇతర విషయాలు తెలిసే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular