Saturday, March 14, 2026
HomeTrending NewsVijaya: మార్కెట్లోకి విజయ గానుగ నూనెలు

Vijaya: మార్కెట్లోకి విజయ గానుగ నూనెలు

కల్తీలేని ఉత్పత్తులు ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. విజయ బ్రాండ్ నుండి నాణ్యమైన వంటనూనెలు, వంటనూనెల తయారీపై దృష్టిపెట్టిన ఆయిల్ ఫెడ్ వినియోగదారులకు సేవలు అందిస్తోందని వెల్లడించారు. హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో ఈ రోజు మార్కెట్లోకి  విజయ బ్రాండ్ వేరుశెనగ గానుగ నూనెను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విడుదల చేశారు. వేరుశెనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, కొబ్బరి, రైస్ బ్రాన్, పామాయిల్, గానుగ నూనెలు ఉత్పత్తి చేస్తున్న ఆయిల్ ఫెడ్… తాజాగా గానుగ నూనె మార్కెట్లోకి విడుదల చేసింది.

విజయ బ్రాండ్ ఉత్పత్తులను అందరూ ఆదరించాలని, శుద్ధమయిన ఆహారాన్ని ఎంపిక చేసుకునే అవకాశం మన చేతుల్లోనే ఉందని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ లోని అన్ని రైతుబజార్లలో విజయ ఔట్ లెట్లు ఏర్పాటు చేస్తున్నామని, మొత్తం 33 జిల్లాకేంద్రాలలో ఔట్ లెట్ల ఏర్పాటుకు చర్యలు తెస్సుకున్తున్నట్టు ప్రకటించారు. ఖమ్మం, కరీంనగర్ లో ప్రారంభమైన ఔట్ లెట్లు…సిద్దిపేట, వనపర్తిలలో జూన్ లో ప్రారంభం కానున్నాయని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో లాభాల బాటలో ఆయిల్ ఫెడ్ ఉందని, ఏటా వెయ్యి కోట్ల టర్నోవర్ సాధించి వంద కోట్ల లాభాలలో ఆయిల్ ఫెడ్ .. కేవలం నూనె ఉత్పత్తులపై పది కోట్ల లాభం సమకురుస్తోందని మంత్రి వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచెర్ల రామకృష్ణారెడ్డి, ఎండీ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular