Saturday, March 14, 2026
HomeTrending Newsమినీప్యాక్ లలో విజయ ఉత్పత్తులు

మినీప్యాక్ లలో విజయ ఉత్పత్తులు

వినియోగదారులకు సౌకర్యంగా ఉండేందుకు విజయ డెయిరీ ఉత్పత్తులను తక్కువ ధరలలో చిన్న ప్యాక్ లలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య,పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ లోని MLA క్వార్టర్స్ లో విజయ డెయిరీ ఆధ్వర్యంలో నూతనంగా ఉత్పత్తి చేసిన 10, 20 రూపాయలు, 50 ML గల స్పెషల్ గ్రేడ్ అగ్ మార్క్ నెయ్యి ప్యాకెట్ లను మంత్రి శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విజయ డెయిరీ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని అనేక నూతన ఉత్పత్తులను మార్కెట్ లో అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.

అన్ని రకాల విజయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు పెద్ద ఎత్తున ఔట్ లెట్ ల ఏర్పాటు, ట్రై సైకిల్స్ ద్వారా విక్రయాలు జరుపుతున్న విషయాన్ని గుర్తుచేశారు. రానున్న రోజులలో నూతన ఉత్పత్తులు అనేకం మార్కెట్ లోకి తీసుకొచ్చి నూతన ఔట్ లెట్ లను మరిన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో విజయ డెయిరీ మార్కెటింగ్ GM మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : తెలంగాణలో పాడి పరిశ్రమకు ప్రోత్సాహం – మంత్రి తలసాని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular