Friday, November 22, 2024
HomeTrending Newsసివిల్ కోడ్ పై మీ వైఖరేంటి?: బాబుకు విజయసాయి ప్రశ్న

సివిల్ కోడ్ పై మీ వైఖరేంటి?: బాబుకు విజయసాయి ప్రశ్న

మైనార్టీలు, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకమైన యూనిఫాం సివిల్‌ కోడ్‌ను అమలు చేయాలని  బీజేపీ ప్రయత్నిస్తోందని చంద్రబాబు దీనికి అనుకూలమా? వ్యతిరేకమా అనేది 24 గంటలలోగా  చెప్పి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని వైఎస్సార్సీపీ నేత, నెల్లూరు లోక్ సభ అభ్యర్ధి వి విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే ఆయన ముస్లిం, క్రిస్టియన్ల మనోభావాలకి వ్యతిరేకిగా పనిచేస్తున్నారని అందరూ అర్ధంచేసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో అయన మీడియాతో మాట్లాడారు.

ఏ చట్టం తీసుకురావాలన్నా.. అందరి ఏకాభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం ఉందనేది తమ నేత జగన్ అభిప్రాయమని చెప్పారు. విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న సంస్కృతులు ఉన్న ఈ దేశంలో  ఏకాభిప్రాయం అనివార్యమని, అందుకే ఏ చట్టం తీసుకు వచ్చినా ఏకాభిప్రాయం ఉండాల్సిందే అని జగన్ స్పష్టంగా చెప్పారని విజయసాయి పేర్కొన్నారు.

తాము ఎప్పుడూ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని, కానీ టిడిపి మతతత్వ పార్టీ బీజేపీతో జతకట్టిందని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రప్రభుత్వాన్ని బలపరిచాం తప్ప… మైనార్టీల మనోభావాల్ని దెబ్బతీసే ఎవరితోనూ జతకట్టలేదని, భవిష్యత్తులోనూ లాంటి పని చేయబోమని ప్రకటించారు.

నెల్లూరు జిల్లాలో టిడిపి నేతలు అనైతిక, అవినీతి రాజకీయాలకు పాల్పడుతున్నారని… టీడీపీ ఎంపి  అభ్యర్థి వేమిరెడ్డి రూ. వెయ్యి కోట్లు, నెల్లూరు అర్బన్ అభ్యర్ధి నారాయణ గారు రూ.500 కోట్లు ఖర్చుపెడతారంటున్నారని విజయసాయి ఆరోపించారు. విదేశాల నుంచి ఎన్‌ఆర్‌ఐలు, ధనవంతులు, పెత్తందారులూ ఇక్కడ పోటీచేస్తున్న నేపథ్యం ఉందని…  రాజకీయ పరిపక్వత గల్గిన నెల్లూరు జిల్లాలో డబ్బుతో రాజకీయం నడిపిస్తాం.. చేస్తాం అనే అనైతిక విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.

ఈ ఎన్నికలో టిడిపి పక్షాన పోటీ చేస్తున్న  వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ప్రశాంతి రెడ్డిలు ఇంపోర్టెడ్‌ లీడర్స్ అని వీరు మొదటినుంచీ టిడిపిలో ఉన్నవారు కాదని గుర్తు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్