సింహాచలం ఆలయ భూముల్లో జరిగిన అవకతవకల్లో టిడిపి నేత అశోక్ గజపతిరాజుపై అనుమానం ఉందని రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. అశోక్ గజపతి దేవస్థానానికి ధర్మకర్తనా లేక అధర్మకర్తనా అనేది చెప్పాలని ప్రశ్నించారు. ఆలయ భూములు, ఆస్తుల్లో అక్రమాలకు పాల్పడకపొతే కోర్టుకు వెళ్లి స్టే ఎందుకు తెచుకున్నారని నిలదీశారు. పంచగ్రామాల సమస్య కోర్టులో ఉందన్నారు. ఆశోక్ గజపతి హయాంలో జరిగిన కుంభకోణాలను బైటపెట్టి ఆలయ ఆస్తులను కాపాడతామన్నారు. నేడు విజయసాయి రెడ్డి సింహాచలం అప్పన్నను దర్శించుకున్నారు.
846 ఎకరాల దేవస్థానం భూమి అన్యాక్రాంతమైందని, దాదాపు 8 వేల కోట్ల రూపాయల ఆస్తులు దోచుకున్నారని విజయసాయి ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలోనే ఈ అక్రమాలు జరిగాయని దీనిపై మీడియా చర్చకు తాను సిద్ధమని, అశోక్ గజపతి సిద్ధమా అని సవాల్ విసిరారు. మహిళలపై ఏమాత్రం గౌరవం ఉన్నా మన్సాస్ ట్రస్ట్ లో పురుషులతో సమానంగా మహిళలకు కూడా బోర్డులో అవకాశం ఇవ్వాలని సూచించారు.