Sunday, March 15, 2026
HomeTrending Newsకుప్పంతో సహా అన్నీ మావే: విజయసాయి

కుప్పంతో సహా అన్నీ మావే: విజయసాయి

Vijayasai  Reddy on Municipals:
కుప్పం మునిసిపాలిటీతో సహా రాష్ట్రంలో జరుగుతోన్న మినీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకు పోవడం ఖాయమని స్పష్టం చేశారు. 2024 ఎన్నికలకు ఈ మినీ ఫలితాలు నిదర్శనంగా ఉంటాయని చెప్పారు.

నారా లోకేష్ ఉపయోగిస్తున్న భాష అసభ్యంగా, తలవంపులు తెచ్చేదిగా ఉందని…. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకుడిగా చెలామణి అవుతోన్న లోకేష్ మాట్లాడే భాష ఇలాగే ఉంటుందా అని విజయసాయి ప్రశ్నించారు.

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లోని 31వ వార్డు పరిధిలోని అల్లిపురంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి బిపిన్ కుమార్ జైన్ కు మద్దతుగా చేపట్టిన ఇంటింటి ప్రచారంలో విజయసాయి పాల్గొన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి జగన్ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమం పథకాలు, కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్ధించారు.

Also Read : లోకేష్.. పిచ్చివాగుడు మానుకో : నాని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular