Tuesday, March 10, 2026
HomeTrending Newsనెల్లూరు ఎంపి అభ్యర్ధిగా విజయసాయి రెడ్డి!

నెల్లూరు ఎంపి అభ్యర్ధిగా విజయసాయి రెడ్డి!

వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నెల్లూరు లోక్ సభ బరిలో దిగనున్నారు. ఇటీవలే పార్టీకి రాజీనామా చేసి రేపు తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ నుంచి ఎంపిగా పార్టీ చేయబోతున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో విజయసాయి తలపడనున్నారు. ఒక ఎంపి, ఇద్దరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తల జాబితాను నేడు వైఎస్సార్సీపీ విడుదల చేసింది.

గత వారం విఆర్ఎస్ తీసుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఎండి ఇంతియాజ్ నిన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన్ను కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్ధిగా జగన్ ఖరారు చేశారు. కాగా, మంగళగిరి ఇన్ ఛార్జ్ గా ఉన్న గంజి చిరంజీవిని తొలగించి ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే కొండ్రు కమల కుమార్తె, మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కోడలు మురుగుడు లావణ్యను ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular