Sunday, January 19, 2025
HomeTrending NewsVijayasai: కుటుంబ ఎజెండాతోనే ఆమె రాజకీయాలు

Vijayasai: కుటుంబ ఎజెండాతోనే ఆమె రాజకీయాలు

బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై వైఎస్సార్సీపీ ఎంపి వి విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్టంలో మద్యం సిండికేట్లతో తనకు,  తమ పార్టీ  లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డికి సంబంధాలున్నాయంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర నేడు బాపట్లలో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

  • పురందేశ్వరిది నిలకడలేని రాజకీయం. ఆమెకు ఓ నియోజకవర్గం లేదు
  • స్వార్ధ, కుటుంబ, సొంత అజెండాతోనే ఆమె రాజకీయం చేస్తున్నారు
  • పురందేశ్వరికి తెలిసింది ఆమె సామాజిక వర్గం గురించి మాత్రమే
  • ఆరోపణలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి
  • ఆమె ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు
  •  ఏమాత్రం సంబంధంలేని ఇద్దరు వ్యక్తులపై ఆరోపణలు చేయడం తగదు
  • వైస్సార్ సీపీ పెత్తందారుల పార్టీ కాదు.. పేదల, బలహీన పార్టీ
  •  చంద్రబాబు తన హయాంలో ప్రజలకు ఏం చేశారో చెప్రపాలి.
  • చంద్రబాబుకు తెలిసింది మోసం, దగా మాత్రమే,  ఆయన వలన అభివృద్ధి చెందింది ఆయన సొంత వర్దిగీయులే,
  • చంద్రబాబు పట్ల ప్రజలు సానుభూతి చూపించడం లేదు
  • జాతీయ నాయకులు కూడా ఆయనకు సపోర్ట్ చేయడం లేదు
  • చంద్రబాబు పాపం పండింది కనుకే జైల్లో వున్నారు, పక్కా ఆధారాలతోనే ఆయన అరెస్ట్ అయ్యారు
  • లోకేష్‌కు నాయకత్వ లక్షణాలు లేవు, చంద్రబాబులా లోకేష్ కూడా వ్యవస్థలను మేనేజ్ చేయాలని చూస్తున్నారు
  • ఢిల్లీ వెళ్లి అక్కడ మేనేజ్ చేయాలని లోకేష్ చూశారు కానీ, కుదరలేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్