Sunday, January 26, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్బాబులో పరివర్తన రాలేదు : విజయసాయి

బాబులో పరివర్తన రాలేదు : విజయసాయి

ట్విట్టర్ వేదికగా మరోసారి తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై పార్టీపై వైఎస్సార్సీపి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఓడిపోయి రెండేళ్ళు అయినా ఎందుకు ఓడిపోయారో తెలుసుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబులో ఇప్పటికీ పరివర్తన రాలేదని, తనను అర్ధం చేసుకోలేకే ప్రజలు ఓడించారంటూ చెప్పుకోవడం ఆయనకే చెల్లిందన్నారు.

పరీక్ష బాగా రాసినా పేపర్ దిద్దిన టీచర్ తనను కావాలనే ఫెయిల్ చేశాడని విద్యార్ధి ఎద్సినట్లుగానే చంద్రబాబు వ్యవహారం కూడా ఉందని విజయసాయి రెడ్డి వ్యాఖానించారు.

వైఎస్సార్సీపి అధికారం చేపట్టి మే ౩౦ నాటికి రెండేళ్ళు పూర్తి చేసుకుంది. గతవారం జరిగిన తెలుగుదేశం మహానాడులో చంద్రబాబు పార్టీ ఓటమిపై పలు వ్యాఖలు చేశారు. గత ఐదేళ్ళల్లో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, అయినా ప్రజలు ఎందుకు ఓడించారో అర్ధం కావడం లేదని బాబు వ్యాఖానించారు. బాబు వ్యాఖలకు విజయసాయి రెడ్డి తాజా ట్వీట్ తో స్పందించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్