Saturday, March 7, 2026
Homeసినిమామహేష్ కి రాయడం బాగా టఫ్ : విజయేంద్ర

మహేష్ కి రాయడం బాగా టఫ్ : విజయేంద్ర

సూపర్ స్టార్ మహేష్‌ బాబు – దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లోమూవీ రానుందని గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ పూర్తయిన తర్వాత మహేష్‌ తో మూవీ చేస్తానని గత సంవత్సరం స్వయంగా రాజమౌళి ప్రకటన చేయడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా స్టార్ట్ అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కథ పై రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

మహేష్ తో రాజమౌళి ఛత్రపతి శివాజీ జీవిత కథను తెరకెక్కించనున్నారని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత అది భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అని.. ఇది ఆస్ట్రేలియా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉండగా ఇటీవల ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూలో ఈ చిత్ర నిర్మాత డా.కె.ఎల్.నారాయణ మాట్లాడుతూ… మహేష్‌ – రాజమౌళి కాంబినేషన్ లో రూపొందే చిత్రానికి కథ ఏంటి అనేది ఇంకా ఖరారు కాలేదని చెప్పారు.

ఇటీవల ఆలీతో సరదాగా పొగ్రామ్ లో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు రాజమౌళి తండ్రి, సుప్రసిద్ధ సిద్ధ రచయిత విజయేంద్రప్రసాద్. మహేష్‌ బాబుకి కథ రాయడం చాలా కష్టంతో కూడుకున్న పని అని, మహేష్ కి కథ రాయాలంటే.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ హెల్ప్ తీసుకోవాలి అని నవ్వుతూ చెప్పారు. మరి.. మహేష్‌ తో రాజమౌళి తెరకెక్కించే భారీ చిత్రానికి ఎలాంటి కథ అందిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular