Charan next: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. సౌత్ ఆడియన్స్ నే కాకుండా నార్త్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకున్నాడు. దీంతో చరణ్ నెక్ట్స్ ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం చరణ్.. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ పాన్ ఇండియా మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు.
అయితే.. ఈ సినిమా తర్వాత చరణ్.. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఓ భారీ చిత్రం చేయనున్నారు. శంకర్ తో చేస్తున్న సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు చరణ్.. కమల్ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ కమల్ డైరెక్టర్ ఎవరంటే… లోకేష్ కనకరాజ్. కమల్ తో లోకేష్ కనకరాజ్ విక్రమ్ అనే సినిమాను తెరకెక్కించారు. ఇటీవల రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ కు అనూహ్యమైన స్పందన లభిస్తోంది.
ఇటీవల కోలీవుడ్ మీడియాతో మాట్లాడిన లోకేష్.. రామ్ చరణ్ కోసం కథ రెడీ చేశానని.. ఇది తెలుగు, తమిళ్ లో రూపొందనుందని చెప్పాడట. దీంతో ఈ ప్రాజెక్ట్ ను ఎవరు నిర్మించనున్నారు..? చరణ్ లోకేష్ కనకరాజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా.? అనేది ఆసక్తిగా మారింది. మరి.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read : చరణ్, శంకర్ మూవీ లేటెస్ట్ అప్ డేట్