Saturday, January 18, 2025
Homeసినిమా'తంగలాన్' సీక్వెల్ పై స్పందించిన విక్రమ్! 

‘తంగలాన్’ సీక్వెల్ పై స్పందించిన విక్రమ్! 

విక్రమ్ అభిమానులంతా ఇప్పుడు ‘తంగలాన్’ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. మొదటి నుంచి కూడా విక్రమ్ వైవిధ్యభరితమైన .. ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తూ వస్తున్నారు. అదే ఆయన ప్రత్యేకతగా నిలిచింది. అయితే ఆయనకి సరైన హిట్ పడక చాలా కాలమే అయింది. కథల విషయంలో .. లుక్ విషయంలో ఎప్పటిలానే ఆయన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అయితే ఈ సారి మాత్రం ‘తంగలాన్’పై అంచనాలు ఏర్పడ్డాయి.

ఇంతవరకూ విక్రమ్ కనిపిస్తూ వచ్చిన గెటప్స్ వేరు .. ఈ సినిమాలోని గెటప్ వేరు. ఇంతలా విక్రమ్ మారిపోవడం అభిమానులలో ఆసక్తిని పెంచుతూ వెళుతోంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఆంగ్లేయుల కాలంలో బంగారు గనుల చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఆ బంగారు గనులు అక్కడి గిరిజనుల జీవితాలను ఎలా ప్రభావితం చేశాయనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ నెల 15వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో విక్రమ్ బిజీగా ఉన్నాడు.  ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందా లేదా అనే క సందేహం అభిమానులలో ఉంది. ఆ విషయం విక్రమ్ వరకూ వెళ్లడంతో ఆయన స్పందించారు. ఈ కథ చాలా విస్తారమైనదనీ .. అనేక మలుపులకు .. పాత్రలకు అవకాశం ఉందని అన్నారు. అందువలన ఓ నాలుగు పార్టులుగా ఈ సినిమా చేసుకోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిని బట్టి ఈ సినిమాకి సీక్వెల్ ఉండనుందనే చెప్పుకోవచ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్