Sunday, January 19, 2025
Homeసినిమావిక్రమ్ దర్శకత్వంలోనే నాగచైతన్య ఓటీటీ ప్రాజెక్ట్

విక్రమ్ దర్శకత్వంలోనే నాగచైతన్య ఓటీటీ ప్రాజెక్ట్

అక్కినేని నాగచైతన్య ఓటీటీలో ఎంట్రీ ఇవ్వనున్నారని.. గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఓటీటీ ప్రాజెక్ట్ ని ప్రముఖ నిర్మాత శరత్ మరార్ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. దీనికి ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందే ఈ వెబ్ సిరీస్ 8 భాగాలుగా ఉంటుందని తెలిసింది. చైతన్య ఫస్ట్ టైమ్ ఈ జోనర్ లో నటిస్తుండడం విశేషం. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం. పూర్తి వివరాలను అతి త్వరలోనే ప్రకటించనున్నారు.

ఇక నాగచైతన్య సినిమాల విషయానికి వస్తే.. ‘లవ్ స్టోరీ’ రిలీజ్ ఎప్పుడు అనేది త్వరలోనే క్లారిటీ రానుంది. ‘ధ్యాంక్యూ’ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అమీర్ ఖాన్ తో కలిసి నాగచైతన్య నటిస్తున్న బాలీవుడ్ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత చైతన్య ‘బంగార్రాజు’ షూటింగ్ లో జాయిన్ అవుతారు. ఇందులో చైతన్య సరసన కృతిశెట్టి నటిస్తుంది. మనం తర్వాత నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఈ క్రేజీ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్