Saturday, January 18, 2025
Homeసినిమామహేశ్ తో తలపడే విలన్ గా విక్రమ్!

మహేశ్ తో తలపడే విలన్ గా విక్రమ్!

మహేశ్ బాబు అభిమానులంతా ఇప్పుడు ఆయన రాజమౌళితో చేయనున్న సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అందరి దృష్టి ఈ ప్రాజెక్టుపైనే ఉంది. ఈ సినిమా కోసమే మహేశ్ రెడీ అవుతున్నాడు. కథ ప్రకారం ఆయన లుక్ డిఫరెంట్ గా ఉండనుంది. అందువల్లనే ఈ సినిమా షూటింగు పూర్తయ్యేవరకూ మహేశ్ బయట ఎక్కడా కనిపించడనే టాక్ ఉంది. ఇంతవరకూ మహేశ్ చేసిన సినిమాలు ఒక లెక్క .. ఇది ఒక లెక్క అంటున్నారు. ఆ రేంజ్ లో ఈ పాత్రను డిజైన్ చేశారట.

రాజమౌళి సినిమాలలో ప్రతినాయకుడు చాలా పవర్ఫుల్ గా కనిపిస్తూ ఉంటాడు. హీరోతో పాటు విలన్ గురించి కూడా మాట్లాడుకునేలా ఆయన డిజైన్ చేస్తూ ఉంటాడు. అందువలన ఈ సినిమాలో విలన్ రోల్ ను ఎవరితో చేయించనున్నారా అనే ఒక ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ సీనియర్ స్టార్ విక్రమ్ పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ఆయనను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. దాదాపు ఖరారైపోయినట్టేనని అంటున్నారు.

ఈ మధ్య కాలంలో కోలీవుడ్ స్టార్స్ తెలుగు సినిమాలలో విలన్ రోల్స్ చేయడానికి ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. కమల్ .. సూర్య .. విజయ్ సేతుపతి వంటి స్టార్స్ ఆ జాబితాలో కనిపిస్తున్నారు. అలా విక్రమ్ కూడా ఈ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఒక కథానాయికగా ఇండోనేషియా బ్యూటీ ‘చెస్లా’ కనిపించనుంది. మహేశ్ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మితం కానున్న ఈ సినిమా, ఆయన కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్