Saturday, March 7, 2026
Homeసినిమాటాలీవుడ్ లో 'తంగలాన్'కి గట్టిపోటీ! 

టాలీవుడ్ లో ‘తంగలాన్’కి గట్టిపోటీ! 

మొదటినుంచి కూడా విక్రమ్ ప్రయోగాల పట్లనే ఆసక్తిని చూపుతూ వెళ్లాడు. అదే ఆయన ప్రత్యేకతగా నిలిచింది కూడా. జయాపజయాల సంగతి అలా ఉంచితే, కొత్తగా కనిపించడానికి విక్రమ్ ఎప్పుడూ వెనుకాడలేదు. ఈ కారణంగా ఆయన చాలా కాలం పాటు సక్సెస్ చూడని సందర్భాలు ఉన్నాయి. అయినా ఆయన ప్రయోగాలను ఆపకుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే వెళుతున్నాడు. అందుకు నిదర్శనంగా కనిపిస్తున్న సినిమానే ‘తంగలాన్’.

ఇది కోలార్ గోల్డ్ ఫీల్డ్ కి సంబంధించిన కథ. ఆంగ్లేయుల కాలంలో ఈ కోలార్ ఫీల్డ్ తవ్వకాల కోసం వాళ్లు ఒక గిరిజన తెగ సాయాన్ని తీసుకుంటారు. ఆ తెగకి చెందిన కథానాయకుడి తెగింపుగా ఈ కథ నడుస్తుంది. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జ్ఞానవేల్ రాజా నిర్మించారు. మాళవిక మోహనన్ .. పార్వతీ తిరువోతు .. పశుపతి ముఖ్యమైన పాత్రలను పోషించారు. అలాంటి ఈ సినిమా, తమిళంతో పాటు, తెలుగులోను ఆగస్టు 15వ తేదీన విడుదల కానుంది.

తెలుగులో విక్రమ్ కి ఎప్పటి నుంచో మంచి ఫాలోయింగ్ ఉంది. అందువలన ఇక్కడ కూడా ఈ సినిమాను భారీగానే రిలీజ్ చేస్తున్నారు. అయితే అదే రోజున రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ .. రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలు విడుదలకు ఉన్నాయి. ఈ రెండు సినిమాలపై చాలామందిలో అంచనాలు ఉన్నాయి. అయినా ‘తంగలాన్’ వెనక్కి తగ్గే ఆలోచన చేయడం లేదు. విక్రమ్ లుక్ .. ఇంతవరకూ వదలిన అప్ డేట్స్ ఈ సినిమాపై అందరిలో కుతూహలాన్ని పెంచుతూ వెళ్లాయి. హిట్ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న విక్రమ్ కి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందేమో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular