Thursday, March 19, 2026
Homeసినిమావినరో భాగ్యము విష్ణు కథ” ఫస్ట్ సింగిల్ విడుదల

వినరో భాగ్యము విష్ణు కథ” ఫస్ట్ సింగిల్ విడుదల

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ , 18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా “వినరో భాగ్యము విష్ణు కథ”. ఇందులో యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం నటించారు. ఆయనకు జంటగా క‌శ్మీర ప‌ర్ధేశీ నటిస్తోంది.

తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమాతో ముర‌ళి కిషోర్ అబ్బురు ద‌ర్శ‌కుడిగా తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచయం అవుతున్నారు. ఇది వరకే ఈ  మూవీ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నుండి మొదటి సింగిల్ సాంగ్ ను కళా తపస్వి కే విశ్వనాథ్ చేత రిలీజ్ చేయించింది చిత్రబృందం. “వాసవసుహాస” అనే పాటను పాటను రిలీజ్ చేస్తూ “నాకు నా పాత రోజులు గుర్తొస్తున్నాయి, ఎలా ఒప్పుకున్నారా ప్రొడ్యూసర్స్ అనిపిస్తుంది అంటూ ఇటవంటి పాటను ఆ చిత్రబృందం చేయడం సంతోషం అంటూ కితాబిచ్చారు. ఈ పాటను కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని రచించారు. ఈ సినిమా 2023 ఫిబ్రవరి 17న విడుదల కానుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు అధికారికంగా విడుద‌ల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular