Saturday, January 25, 2025
HomeTrending NewsUK MP: సిఎం కెసిఆర్ కు యుకె ఎంపి అభినందన లేఖ

UK MP: సిఎం కెసిఆర్ కు యుకె ఎంపి అభినందన లేఖ

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమాజిక సమానత్వ దార్శనికత, దేశ విదేశాల మేధావులు సీనియర్ రాజకీయ వేత్తలనుంచి ప్రశంసలను అందుకుంటున్నది. భారతదేశం గర్వించే రీతిలో డా. బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల మహా విగ్రహాన్ని ఇటీవలే ఆవిష్కరించిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల సర్వత్రా అభినందనలు వెల్లువెత్తాయి.
ఇందులో భాగంగా…యు.కె కు చెందిన పార్లమెంటు మెంబర్ (ఎం పీ) ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనికతను కొనియాడుతూ స్వయంగా లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
యు.కె లోని సౌతాల్ ఈలింగ్ నుంచి పార్లమెంటు సభ్యుడుగా ప్రస్థుతం పనిచేస్తున్న బ్రిటీష్ ఇండియన్ సంతతికి చెందిన 76 ఏండ్ల సీనియర్ రాజకీయ నాయకుడు వీరేంద్ర శర్మ…ముఖ్యమంత్రికి ఈ మెయిల్ ద్వారా అభినందనలు తెలుపుతూ లేఖ రాసారు.

లేఖ సారాంశం వారి మాటల్లోనే..
‘‘ డా. బిఆర్ అంబేద్కర్ మహా విగ్రహాన్ని నిర్మించి ఆవిష్కరించడం గొప్ప విషయం ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం. డా అంబేద్కర్ పుట్టుక వారు చేసిన కృషి వారి చరిత్రే భారత దేశం గురించి వివరిస్తుంది. అటు యు.కె లోనూ ఇటు ఇండియాలోనూ నాటి పరిస్థితుల్లో అంబేద్కర్ ప్రదర్శించిన సహనం, సమానత్వం కోసం వారి పట్టుదల, వారి ఆలోచనలు, కార్యాచరణ, విరామమెరుగని వారి రచనా వ్యాసంగం మహోన్నతమైనవి.
నాడు కొనసాగుతున్న కాలం చెల్లిన సాంప్రదాయ మూసధోరణులను పక్కకుతోసి, ఎటువంటి వివక్ష కు తావులేకుండా అన్ని వర్గాలను, సమానత్వంతో కూడిన సమ్మిళితాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, బహుళత్వం దిశగా సమాజాన్ని నడిపించేందుకు.. వారి ఆలోచనలకు రూపమిచ్చి నవీన భారత రాజ్యాంగాన్ని డా. బిఆర్.అంబేద్కర్ రూపొందించించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, పితామహుడుగా భారత దేశ పురోగమనానికి కొనసాగింపుగానే వారు రాజ్యాంగ్యాన్ని నిర్మించారు.
భవిష్యత్తు తరాల కోసం డా. బాబాసాహెబ్ అంబేద్కర్ దార్శనికతను మనం ఇంకా కూడా పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నం. మూఢ విశ్వాసాలకు తావులేకుండా, భారత ప్రజల అభివృద్ధే ధ్యేయంగా వారు రాజ్యాంగాన్ని రచించారు.
యు.కె లోని తెలంగాణకు చెందిన సమాజిక సంస్థలతో కలిసి పనిచేయడం నాకు గర్వంగా భావిస్తున్నాను.‘‘ అని తన లేఖలో తెలిపారు.

వీరేంద్ర శర్మ గురించి …
పంజాబ్ కు చెందిన 76 ఏండ్ల వీరేంద్ర శర్మ తన చిన్ననాడే య.కె కు వలస వెళ్లారు. జీవన భృతికోసం అక్కడ బస్ కండక్టరుగా ఉద్యోగం కూడా చేసారు. తర్వాతి కాలం లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఉన్నత విద్యను కూడా అభ్యసించిన వీరేంద్ర శర్మ పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజాదరణ పొందుతూ అట్లా అంచెలంచలుగా ఎదుగుతూ లేబర్ పార్టీ తరఫున 2007 లో ఎంపీ గా గెలిచి యు.కె సౌతాల్ ఈలింగ్ నుంచి పార్లమెంటు సభ్యునిగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్