Sunday, January 19, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్హెచ్‌పీసీఎల్‌ ఘటనపై విచారణ

హెచ్‌పీసీఎల్‌ ఘటనపై విచారణ

విశాఖపట్నంలోని హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) రిఫైనరీలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై విచారణ కోసం ఐదుగురు సభ్యుల సాంకేతిక కమిటీతో కలెక్టర్‌ వినయ్‌చంద్‌ విచారణకు ఆదేశించారు. సీడీయూ-3లో ప్రమాదం, ఆయిల్ లీక్‌కు గల కారణాలపై ఈ కమిటీ విశ్లేషించనుంది. అలానే ఐఐపీఎం,ఆంధ్రా యూనివర్సిటీ కెమికల్ ఇంజనీరింగ్ నిపుణులుతో సాంకేతిక, భద్రతా పరమైన విచారణ జరిపించనున్నారు. ఇందుకు సంబంధించి వారం రోజుల్లో నివేదిక అందుతుందని కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తెలిపారు.

45 నిమిషాలు వ్యవధిలోనే మంటలను అదుపు చేయగలిగామని, సీడీయూ-3 తప్ప మిగిలిన అన్ని యూనిట్లలోనూ ఉత్పత్తి యధావిధిగా కొనసాగుతోందని కలెక్టర్‌ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్