Saturday, January 18, 2025
Homeసినిమాకోర్టులో గెలిచిన విశాల్.. 15 న వస్తున్న ‘మార్క్ ఆంటోని’

కోర్టులో గెలిచిన విశాల్.. 15 న వస్తున్న ‘మార్క్ ఆంటోని’

విశాల్‌ నటించిన తాజా చిత్రం ‘మార్క్ ఆంటోని’. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే.. మార్క్ ఆంటోని మూవీ విడుదల మీద ఇటీవల మద్రాస్ కోర్టు స్టే విధించింది. తాజాగా ఈ కేసులో విశాల్ తరుపున తీర్పు లభించింది. దీంతో మార్క్ ఆంటోని విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. సెప్టెంబర్ 15న గ్రాండ్‌గా మార్క్ ఆంటోని చిత్రం రిలీజ్ కాబోతోంది అంటూ హీరో విశాల్ ట్వీట్ చేశారు. దీంతో విడుదలకు ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపోయాయని అర్థమైపోయింది.

విశాల్ మార్క్ ఆంటోని చిత్రంలో ఎస్ జే సూర్య ముఖ్య పాత్రలో నటించగా.. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించింది. సునిల్, సెల్వ రాఘవన్, అభినయ, కింగ్ స్లే, వై జి మహేంద్రన్ ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు. జీ వీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. మార్క్ ఆంటోని టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన రావడంతో సినిమా మీద తమిళ్ తో పాటు తెలుగులో కూడా హైప్ పెరిగింది.

ఇటీవల ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. నితిన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చంద్రముఖి 2 చిత్రాన్ని కూడా ఈ నెల 15న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. 28కి వాయిదా పడడం మార్క్ ఆంటోనికి ప్లస్ అని చెప్పచ్చు. గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం విశాల్ ఎదురు చూస్తున్నారు. మరి.. విశాల్ ఆశించిన విజయాన్ని మార్క్ ఆంటోని అందిస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్