Tuesday, March 17, 2026
Homeసినిమా'ఐ లవ్ యూ' సాంగ్ తో ఆకట్టుకుంటున్న ‘మార్క్ ఆంటోని’

‘ఐ లవ్ యూ’ సాంగ్ తో ఆకట్టుకుంటున్న ‘మార్క్ ఆంటోని’

హీరో విశాల్ ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘మార్క్ ఆంటోని’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పాన్ ఇండియా మూవీగా గ్రాండ్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ఎస్.జె.సూర్య కూడా నటిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఎస్ వినోద్ కుమార్ నిర్మతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో విశాల్ కి జోడీగా రీతూ వర్మ నటిస్తోంది.

ఓ వైపు సినిమా పనులు వేగంగా ఫినిష్ చేస్తూనే మరో వైపు జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా ‘ఐ లవ్ యూ నే’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మాస్ బీట్ హైలైట్ కాగా.. విశాల్ గెటప్ ఆకట్టుకుంటోంది. శ్రీ మణి రాసిన లిరిక్స్, రామ్ మిరియాల గాత్రం ఈ పాటకు ప్రాణం పోశాయి. రియాలిటీకి దగ్గరగా ఉండే పదాలతో సాంగ్ ఫ్లో సాగింది. ఈ పాటలో హీరో,హీరోయిన్ల మాస్ స్టెప్స్, అందుకు తగట్టుగా వస్తున్న ఫాస్ట్ బీట్ ఆకట్టుకుంటోంది. దీంతో విడుదల చేసిన కాసేపట్లోనే ఈ సాంగ్ వైరల్ గా మారింది.

ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వినాయక చవితి పండుగను పురస్కరించుకుని సెప్టెంబర్ 15న విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ తెలిపారు. అంతకు ముందు ఈ సినిమా నుంచి విశాల్ ఆలపించిన అదరద గుండె అదరద మావా.. బెదరగ బెంగ మొదలవదా సాంగ్ రిలీజ్ చేసి ఆకట్టుకున్న మేకర్స్.. ఇప్పుడు ఐ లవ్ యూ నే లిరికల్ సాంగ్‌తో యూత్ మొత్తాన్ని అట్రాక్ట్ చేశారు. ఇటీవల రిలీజైన ఈ మూవీ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular