Saturday, January 18, 2025
Homeసినిమావైష్ణవ్ తో సురేందర్ రెడ్డి సినిమా

వైష్ణవ్ తో సురేందర్ రెడ్డి సినిమా

‘ఉప్పెన’ తర్వాత క్రిష్ డైరెక్షన్ లో వైష్ణవ్ తేజ్ నటించిన సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. దీని తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో వైష్ణవ్ తేజ్ ఓ సినిమా చేయనున్నారు. నూతన దర్శకుడు పృథ్వీ దర్శకత్వం వహించనున్నారు. అలాగే ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ బ్యానర్ లో కూడా వైష్ణవ్ తేజ్ ఓ సినిమా చేయనున్నారు.

ఈ సినిమాల తర్వాత వైష్ణవ్ తేజ్.. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో మూవీ చేయనున్నారని సమాచారం. ఇక సురేందరెడ్డి విషయానికి వస్తే.. ప్రస్తుతం అఖిల్ తో ఏజెంట్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి ఓ భారీ చిత్రం చేయనున్నారు. ఈ సినిమాని ప్రకటించడం కూడా జరిగింది. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ తో సినిమా ఉంటుందని తెలిసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్