Saturday, January 18, 2025
Homeసినిమా'గరుడ' విలన్ అనేసరికి భయపడిపోయా: శ్రీవిష్ణు 

‘గరుడ’ విలన్ అనేసరికి భయపడిపోయా: శ్రీవిష్ణు 

Vishnu Scared: ‘బాణం’ సినిమాతో చైతన్య దంతులూరి దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ సినిమాలో శ్రీ విష్ణు ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. అదే శ్రీవిష్ణు హీరోగా తన తాజా చిత్రంగా చైతన్య దంతులూరి ‘భళా తందనాన’ సినిమాను రూపొందించాడు. ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన నాయికగా కేథరిన్ అలరించనుంది. వారాహి బ్యానర్ పై అభిరుచిగల సినిమాలను నిర్మిస్తూ వస్తున్న సాయి కొర్రపాటి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించాడు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఈ నెల 6వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో నిర్వహించారు. ఈ వేదికపై శ్రీ విష్ణు మాట్లాడుతూ .. “అందరికీ నమస్కారం .. వైజాగ్ తో నాకు చాలా అనుబంధం ఉంది. నేను ఇక్కడ తిరిగాను .. ఇక్కడే ఉంటూ వచ్చిన ప్రతి సినిమాను చూశాను. నన్ను సినిమాల దిశగా ప్రోత్సహించిన వైజాగ్ కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. సాయి కొర్రపాటి వంటి డేరింగ్ ప్రొడ్యూసర్ ని నేను చూడలేదు. అలాంటి ఒక ప్రొడ్యూసర్ తో కలిసి పనిచేస్తానని కూడా అనుకోవడం లేదు. ఆయనతో కే అలిసి సినిమా చేయడం ఆనందంగా ఉంది.

ఈ సినిమాలో విలన్ గా ‘గరుడ’ రామ్ ను తీసుకుంటున్నట్టుగా చెప్పారు. నేను  ఆయనను ‘కేజీఎఫ్’లో చూశాను. ఆ సినిమాతో ఆయన ఇండియాలోనే నెంబర్ వన్ విలన్ అయ్యాడు. ఆయనను దగ్గర నుంచి చూస్తేనే భయం వేస్తుంది. ఎలాగబ్బా ఆయనతో చేయడం అనేసి చాలా కంగారు పడిపోయాను. ఈ సినిమాలో అలాంటి ఒక విలన్ తో నేను  తలపడతానని ఎవరూ అనుకోరు. కానీ తెరపై చూసిన తరువాత మీకు ఓకే అనిపిస్తుంది. ఈ సినిమా కోసం మీరు పెట్టే రేటుకి డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తామని నేను హామీ ఇస్తున్నాను” అని చెప్పుకొచ్చాడు.

Also Read : ప్రేక్ష‌కులే ఆవిష్క‌రించిన ‘భళా తందనాన’ ట్రైల‌ర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్