Sunday, January 19, 2025
HomeసినిమాVishwak Sen: ఎన్టీఆర్ హీరో.. విలన్ విశ్వక్ సేన్..?

Vishwak Sen: ఎన్టీఆర్ హీరో.. విలన్ విశ్వక్ సేన్..?

ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ మూవీలో కొమరం భీమ్ పాత్రలో అద్భుతంగా నటించి గ్లోబల్ స్టార్ అయ్యారు. నెక్ట్స్ మూవీ ఎప్పుడెప్పుడు చేస్తారా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూశారు. ఆఖరికి ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ గ్రాండ్ గా ప్రారంభమైంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే ఈ భారీ పాన్ ఇండియా మూవీలో ఎన్టీఆర్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఇది జాన్వీ తొలి తెలుగు సినిమా కావడం విశేషం. ఎన్టీఆర్, జాన్వీ పై రాజమౌళి క్లాప్ ఇచ్చారు.

ఇక విశ్వక్ సేన్ విషయానికి వస్తే.. ధమ్కీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు కూడా విశ్వక్ సేనే కావడం విశేషం. అయితే.. విశ్వక్ సేన్ ఎన్టీఆర్ వీరాభిమాని. అందుకనే ధమ్కీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా వచ్చారు. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ మూవీ ప్రారంభమైంది. ఇందులో నటీనటులు ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఇలాంటి టైమ్ లో విశ్వక్ సేన్.. తనకు అవకాశం వస్తే.. ఎన్టీఆర్ మూవీలో విలన్ గా నటించడానికి రెడీ అంటూ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఎన్టీఆర్ హీరో.. విలన్ విశ్వక్ సేన్ అంటే.. చూడడానికి ఇంట్రస్టింగ్ గా ఉంటుంది.

అయితే.. నిజంగా ఎన్టీఆర్ మూవీలో విలన్ గా చేయాలని ఈ స్టేట్ మెంట్ ఇచ్చాడా..? లేక వార్తల్లో ఉండడం కోసం ఈ స్టేట్ మెంట్ ఇచ్చాడా తెలియదు కానీ.. ఇది హాట్ టాపిక్ అయ్యింది. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధమ్కీ మూవీలో విశ్వక్ సేన్ విలన్ నటించి మెప్పించాడు. అయితే.. విశ్వక్ సేన్ విలన్ ఆపర్ అందరికీ కాదు.. కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే అంటున్నాడు. మరి.. కొరటాల విశ్వక్ సేన్ కి ఎన్టీఆర్ మూవీలో విలన్ నటించే ఆఫర్ ఇస్తారా..? లేక ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అవకాశం ఇస్తారా..? ఏం జరగనుందో చూడాలి.

Also Read : #NTR30: అంగరంగ వైభవంగా  ‘ఎన్టీఅర్ 30’ ప్రారంభం

RELATED ARTICLES

Most Popular

న్యూస్