Sunday, January 19, 2025
Homeసినిమాబాలయ్య బాబుతో పెద్ద సినిమా చేస్తాను: విశ్వక్

బాలయ్య బాబుతో పెద్ద సినిమా చేస్తాను: విశ్వక్

విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన ‘దాస్ కా ధమ్కీ’ ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆయనే దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా, ‘ఉగాది’కి థియేటర్లలో దిగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి విష్వక్ మాట్లాడుతూ .. “ఇంతకు ముందు నేను చేసిన సినిమాల కంటే, ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని అందుకుంటామనే నమ్మకం నాకు ఉంది” అన్నాడు.

“ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకి ఎన్టీఆర్ వచ్చిన దగ్గర నుంచి, ఒక్కసారిగా మరింత హైప్ క్రియేట్ అయింది. అందువలన మా టీమ్ అంతా చాలా ఖుషీగా ఉంది. మామూలుగా శుక్రవారం రోజున థియేటర్స్ లో సందడి కనిపిస్తూ ఉంటుంది. ‘ఉగాది’ కారణంగా ఆ సందడి బుధవారం నుంచే మొదలవుతుండటం హ్యాపీగా ఉంది. ఈ సినిమాపై పూర్తి ఎఫర్ట్స్ పెట్టాను ..  తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను.

గతంలో వేంకటేష్ గారితో కలిసి ఒక సినిమాను చేశాను. ఆయనతో కలిసి పనిచేయాలనే ముచ్చట అలా తీరింది. అలాగే బాలయ్య బాబుతో కలిసి నటించాలని ఉంది. ఆయనతో కలిసి పెద్ద సినిమాలో కనిపించాలనే ఆలోచన ఉంది. అందుకు సంబంధించిన విషయాలను ఈ సినిమా రిలీజ్ తరువాత చెబుతాను” అన్నాడు. చూస్తుంటే బాలయ్యబాబుతో కలిసి సందడి చేసే ప్రయత్నమేదో విష్వక్ చేస్తున్నట్టుగానే అనిపిస్తోంది. ‘దాస్ కా ధమ్కీ’ తరువాత, బాలయ్యబాబుతో సినిమాను గురించి ఏం చెబుతాడో చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్