Sunday, January 19, 2025
Homeసినిమాడిసెంబర్ 8 న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ విడుదల

డిసెంబర్ 8 న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ విడుదల

విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి నిర్మిస్తున్న‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి  కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. నేహాశెట్టి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ప్రముఖ నటి అంజలి కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

ప్రముఖ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఆయన స్వర కల్పనలో హృదయాన్ని హత్తుకునే మొదటి గీతం ‘సుట్టంలా సూసి’, ఆగస్ట్ 16న మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా జరిగిన వేడుకలో విడుదలైంది.విద్యార్థుల కోలాహలం నడుమ జరిగిన ఈ మ్యాజికల్ మెలోడీ ఆవిష్కరణకు హాజరైన యువన్ శంకర్ రాజా, విశ్వక్ సేన్, గాయకుడు అనురాగ్ కులకర్ణి, నేహా శెట్టి విద్యార్థులతో ముచ్చటించి వారిలో మరింత ఉత్సాహం నింపారు.

కథానాయకుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. “మల్లారెడ్డి కాలేజ్ నాకు సెంటిమెంట్. ఫలక్‌నుమా దాస్‌ మూవీ ఈవెంట్ కూడా అప్పుడు ఇక్కడే జరిగింది. నేను యువన్ గారి సంగీతానికి పెద్ద అభిమానిని. ఆయన స్వరపరిచిన ఎన్నో పాటలు ఏళ్ల తరబడి వింటూనే ఉంటాం. యువన్ గారితో కలిసి పని చేయాలని కోరుకునే వాడిని. ఇప్పుడు ఆ కల నిజం కావడం సంతోషంగా ఉంది. నాగ వంశీ అన్న నిర్మాణంలో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. మధ్యలో ఒకట్రెండు కథలు కూడా అనుకున్నాం. అయితే ఒకసారి నేను వంశీ అన్నకి కాల్ చేసి.. నేను ఇంతవరకు లుంగీ కట్టలేదు.. ఒకసారి ఊరమాస్ సినిమా చేయాలనుంది.. నేను ఫస్ట్ లుంగీ కడితే నీ ప్రొడక్షన్ లోనే కడతా అని చెప్పాను. ఈ పాట సాప్ట్ గా ఉంటుంది. కానీ సినిమా మాత్రం మాస్ గా ఉంటుంది. థియేటర్లలో ఒక్కొక్కరికి శివాలెత్తి పోతుంది.” అన్నారు.

కథానాయిక నేహా శెట్టి మాట్లాడుతూ.. “సితార బ్యానర్ నాకు డీజే టిల్లు రూపంలో ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఈ సినిమా ద్వారా మరో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. యువన్ గారు పని చేయడం ఈ సినిమా మరింత ప్రత్యేకంగా మారింది. విశ్వక్ సేన్, కృష్ణ చైతన్య తో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది.” అన్నారు.

దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. “యువన్ గారికి నేను పెద్ద అభిమానిని. ఇది నాకు ఫ్యాన్ బాయ్ మూమెంట్. ఆయనతో కలిసి పనిచేసే అవకాశమిచ్చిన మా నిర్మాతలకు కృతజ్ఞతలు. యువన్ గారి సంగీతం, అనురాగ్ కులకర్ణి గాత్రం, శ్రీ హర్ష గారి సాహిత్యం తోడై ఈ పాట ఎంతో అందంగా వచ్చింది.” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్