Saturday, November 23, 2024
HomeTrending Newsవిశ్వనాథ్, చిరంజీవిల బంధం.. మరువలేని అనుబంధం

విశ్వనాథ్, చిరంజీవిల బంధం.. మరువలేని అనుబంధం

కళాతపస్వి కె.విశ్వనాథ్ అనారోగ్యంతో బాధపడుతూ అపోలో హాస్పటల్ లో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. చెన్నైలో సౌండ్ ఇంజనీర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన విశ్వనాథ్ ‘ఆత్మగౌరవం’ సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. ‘చెల్లెలి కాపురం’, ‘సిరి సిరి మువ్వ’, ‘శంకరాభరణం’, ‘శృతిలయలు’, ‘స్వర్ణ కమలం’, ‘సాగర సంగమం’, ‘స్వాతిముత్యం’, ‘స్వాతికిరణం’.. ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించారు. కమర్షియల్ పంథాలో వెళుతున్న తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో గౌరవం తీసుకువచ్చారు.

కళాతపస్వి కె విశ్వనాథ్ తో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. విశ్వనాథ్ డైరెక్షన్ లో చిరంజీవి ‘శుభలేఖ’, స్వయంకృషి, ఆపధ్భాంధవుడు చిత్రాల్లో నటించారు. ఇవి కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించాయి. దీంతో ఈ సినిమాలు చిరంజీవికి ఎంతో పేరు తీసుకువచ్చాయి. పాత్రకు తగ్గట్టుగా ఎలా నటించాలి అనేది విశ్వనాథ్ చిరంజీవికి చెప్పేవారట. అందుచేత ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని..విశ్వనాథ్ గారి పట్ల చిరంజీవి ఎనలేని అభిమానం చూపించేవారు. ఇటీవల విశ్వనాథ్ ను చిరంజీవి కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఆయన్ని కలిసిన ప్రతిసారీ ఓ తండ్రి దగ్గర కొడుకు ఎలా ఉంటారో అలా చిరంజీవి ఉండేవారు. ఆయన అంటే తండ్రిలా, గురువులా భావిస్తాను అంటూ విశ్వనాథ్ పట్ల ఎంత ప్రేమ ఉందో చూపించేవారు. ఈవిధంగా చిరంజీవి, విశ్వనాథ్ ల బంధం మరువలేని అనుబంధం అని చెప్పచ్చు. యాభై సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన విశ్వనాథ్ కు అందరివాడు.. అజాతశత్రువు అనే పేరు ఉంది. దాసరి నారాయణరావుది ఓ స్కూల్ అయితే… రాఘవేంద్రరావుది మరో స్కూల్.. వీరిద్దరికి భిన్నంగా విశ్వనాథ్ ది మరో స్కూల్. సంగీతం, సాహిత్యం, తెలుగుదనం, భారతీయతకు పెద్ద పీట వేసి తెలుగు సినిమాకి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన గొప్ప అరుదైన దర్శకుడు విశ్వనాథ్. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్