Sunday, January 19, 2025
Homeసినిమాఅఘోరగా భయపెడుతున్న విశ్వక్ సేన్

అఘోరగా భయపెడుతున్న విశ్వక్ సేన్

ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే హీరో విశ్వక్ సేన్. తాజాగా ఆయన మరో ప్రయోగం చేస్తున్నారు. సరికొత్త జోనర్ లో సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పేరు గామి. టైటిలే కాదు.. సినిమా కథ కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది అంటున్నారు చిత్రయూనిట్.  తాజాగా ఈ మూవీ టీజర్ విడుదల అయింది. అద్భుతమైన టెక్నికల్ వ్యాల్యూస్.. అత్యున్నతమైన విజువల్స్ తో టీజర్ ఆకట్టుకుంటుంది. ఇందులో హీరో విశ్వక్ సేన్ అఘోర పాత్రలో నటిస్తున్నారు. టీజర్ లో విశ్వక్ కనిపించకపోయినా 2-3 షాట్స్ లో ఆ ఫీల్ కనిపించింది.

ఈ చిత్రానికి విద్యాధర్ కాగిట దర్శకత్వం వహిస్తున్నారు. V సెల్యులాయిడ్, కార్తీక్ శబరిష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు. విశ్వక్ సేన్, చాందిని చౌదరి, అభినయ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి టెక్నికల్ టీమ్: దర్శకుడు: విద్యాధర్ కాగిట, నిర్మాతలు: V సెల్యులాయిడ్, కార్తీక్ శబరిష్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్