Sunday, February 23, 2025
Homeసినిమావినూత్నంగా విడుదల వాయిదా ప్రకటన

వినూత్నంగా విడుదల వాయిదా ప్రకటన

Arjuna Kalyam delayed:  వెళ్లిపోమాకే, ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్, హిట్, పాగల్ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన విశ్వక్ సేన్ న‌టించిన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్‌ ప్రసాద్ సమర్పణలో… ఎస్‌విసిసి డిజిటల్ పతాకం పై ఆయన తనయుడు బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు ‘రాజావారు రాణీగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా కథ అందించ‌గా.. విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించారు.


విభిన్న క‌థాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని మార్చి 4న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. అనుకోని కారణాల వల్ల వాయిదాపడింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సినిమా వాయిదా ప‌డింది అనే విషయాన్ని వెరైటీగా చెబుతూ.. ప్రకటన విడుదల చేసింది. ‘‘అల్లం అర్జున్‌కుమార్‌ జాతక రీత్యా మార్చి 4వ తేదీన పెళ్లి ముహూర్తం సరికాదని జ్యోతిష్యులు తీర్మానించారు. కావున కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం. ఇట్లు అల్లం వారి పెళ్లిబృందం’’ అని చెప్ప‌డం జ‌రిగింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్