టాలెంటెడ్ యంగ్ హీరో విష్వక్‌సేన్‌కు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎంపిక చేసుకునే చిత్రాలు యూత్ ఆడియెన్స్ ను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. విష్వక్ తాజా సినిమా ‘పాగల్’. దీనిపై ఇప్పటికే ఎన్నో అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఆగస్ట్ 14న ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. శనివారం సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో విష్వక్ సేన్ కూల్ లుక్‌తో చేతిలో ఎర్రగులాబీని పట్టుకుని చిరునవ్వు చిందిస్తూ కనిపిస్తున్నాడు. వెనుక పోస్టర్‌లో మబ్బుల నుంచి లవ్ సింబల్ కనిపిస్తుంది. అంటే సినిమా ప్రేమకథా చిత్రమని పోస్టర్ తెలియజేస్తుంది.
ఇదొక అద్భుతమైన ప్రేమకథ. నరేశ్ కుప్పిలి దర్శకుడు. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్లపై బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘పాగల్’ చిత్రంలో భిన్నమైన క్యారెక్టర్‌ను చేస్తున్నారు విష్వక్‌సేన్
నివేదా పేతురాజ్ లీడ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి, మేఘా లేఖ హీరోయిన్స్ గా కూడా కనిపించనున్నారు. రధన్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్.మణికందన్ సినిమాటోగ్రాఫర్