Sunday, January 19, 2025
Homeసినిమావిశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు

విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు

విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో విశ్వక్ సేన్ కి జంటగా నేహా శెట్టి నటించింది. ఈ మూవీ టీజర్ విశేషంగా ఆకట్టుకుని సినిమా పై ఆడియన్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న విడుదల చేయనున్నట్టుగా చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేశారు.

ఇదిలా ఉంటే.. తన మాటలతో అప్పుడప్పుడు వార్తల్లో నిలిచే విశ్వక్ సేన్.. మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఈసారి ఏమన్నాడు..? అసలు ఏం జరిగింది..? అనుకుంటున్నారా..? విషయం ఏంటంటే.. డిసెంబర్ 22న సలార్ వస్తుండడంతో డిసెంబర్ 22 రిలీజ్ చేయాలి అనుకున్న నాని హాయ్ నాన్న, నితిన్ ఎక్స్ ట్రా చిత్రాలు డిసెంబర్ 7న వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. అయితే.. హాయ్ నాన్న, ఎక్స్ ట్రా చిత్రాల నిర్మాతలు  నాగవంశీ పై ఒత్తిడి తీసుకురావడంతో గ్యాంగ్ ఆఫ్ గోదావరి రిలీజ్ డేట్ మార్చాలి అనుకుంటున్నాడట.

ఇది విశ్వక్ సేన్ కి  బాగా కోపం తీసుకువచ్చింది. అందుకనే సోషల్ మీడియాలో తనదైన స్టైల్ లో స్పందించాడు.  బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే ప్రతి నా కొడుకు మన గేమ్ మారుద్దామని అనుకుంటాడు. నేను సినిమా చూడకుండా ప్రతి ఫ్రేమ్ ప్రాణం పెట్టి పని చేసి చెబుతున్నా. డిసెంబర్ 8న వస్తున్నా. హిట్, ఫ్లాప్, సూపర్ హిట్, అట్టర్ ఫ్లాప్ ఏదైనా మీదే డెసిషన్. ఆవేశానికి లేదా ఇగోకు తీసుకునే డెసిషన్ కాదు. తగ్గే కొద్దీ మింగుతారని అర్థమైంది. డిసెంబర్ 8 శివాలెత్తి పోద్ది. గంగమ్మ తల్లి కి నా ఒట్టు. మహాకాళి మాతో ఉంది. డిసెంబర్ కాకపోతే నన్ను #GOG ప్రమోషన్స్లో చూడరు అంటూ విశ్వక్ అన్నారు. ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. మరి.. ఈ సినిమా డేట్ మారుస్తారో.? అనౌన్స్ చేసిన డేట్ కే వస్తుందో..? చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్