Sunday, January 19, 2025
Homeసినిమా'ఎన్టీఆర్'కి నివాళులర్పించిన 'VS11' చిత్ర బృందం

‘ఎన్టీఆర్’కి నివాళులర్పించిన ‘VS11’ చిత్ర బృందం

విశ్వక్ సేన్ ఓ వైవిధ్యభరితమైన చిత్రం కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో చేతులు కలిపారు. ఇది నైతికత లేని సమాజంలో ఓ గ్రే మ్యాన్ యొక్క ప్రయాణాన్ని వర్ణించే చిత్రం. సితార సంస్థ యూనివర్సల్ అప్పీల్‌ ఉన్న కథలను ఎంచుకుంటోంది. VS11 మరో మైలురాయి లాంటి చిత్రమవుతుందని చిత్ర బృందం నమ్ముతోంది. ‘VS11’ చిత్రం చీకటి మరియు క్రూరమైన ప్రపంచంలో అట్టడుగు నుంచి ధనవంతుడిగా ఎదిగిన వ్యక్తి కథను వివరిస్తుంది. ఈ ప్రపంచానికి నైతికత లేదు, దేనినీ పట్టించుకోదు. అలాంటి ప్రపంచంలో మనిషి మనుగడ సాగించాలంటే.. తన మార్గాన్ని నిర్ణయించుకోవడానికి అతనికి ప్రేరణ, స్ఫూర్తి అవసరం.

‘తెలుగు వారి ఆత్మగౌరవం’, ‘లెజెండ్ ఆఫ్ లెజెండ్స్’గా పేరుగాంచిన స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి 100వ జయంతి సందర్భంగా, VS11నుంచి ది రాగ్స్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి, ఆ మహనీయుడిపై తమకున్న ప్రేమను చాటుకుంది చిత్ర బృందం. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. భారీస్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గంగానమ్మ జాతర పోస్టర్ సినిమా పై ఆసక్తిని, అంచనాలను పెంచింది. ఇక ఇప్పుడు నివాళిగా విడుదల చేసిన పోస్టర్ తెలుగు వారి హృదయాలను హత్తుకునేలా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి సహ నిర్మాతలుగా వ్యవరిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్