Sunday, February 23, 2025
Homeసినిమాఆలోచనలో పడిన మాస్ డైరెక్టర్!

ఆలోచనలో పడిన మాస్ డైరెక్టర్!

టాలీవుడ్ లో మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడిగా వినాయక్ కి పేరుంది. భారీ మాస్ యాక్షన్ సినిమాలను ఆయన తనదైన స్టైల్లో ఆవిష్కరించి, బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను నమోదు చేశాడు. ఎలాంటి స్టార్ హీరోనైనా ఆయన చాలా సున్నితంగా హ్యాండిల్ చేస్తూ, తనకి రావలసిన .. కావలసిన అవుట్ పుట్ ను తీసుకురావడంలో ఆయన సిద్ధహస్తుడు. చిరంజీవి … వెంకటేశ్ .. రవితేజ .. ఎన్టీఆర్ .. చరణ్ వంటి వారికి బ్లాక్ బస్టర్ హిట్లను అందించిన దర్శకుడు ఆయన.

ఒక్క యాక్షన్ సన్నివేశాలను మాత్రమే కాదు .. లవ్ .. ఎమోషన్స్ .. కామెడీ సీన్స్ తెరపై ఆయన ఆవిష్కరించే తీరు ఆసక్తికరంగా ఉంటుంది. ఒక కథలో సామాన్య ప్రేక్షకుడికి కావలసిన అన్ని అంశాలను పొందుపరచగల సమర్థుడు ఆయన. అలాంటి వినాయక్ ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా తరువాత హిట్ కొట్టలేకపోయాడు. రీసెంట్ గా థియేటర్లకు వచ్చిన ‘ఛత్రపతి’ రీమేక్ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ బాలీవుడ్ సినిమా భారీ నిరాశనే మిగిల్చింది.

దాంతో వినాయక్ ఆలోచనలో పడినట్టుగా చెప్పుకుంటున్నారు. మొదటి నుంచి కూడా హడావిడి పడిపోయి చకచకా సినిమాలు చేసే అలవాటు వినాయక్ కి లేదు. తన పనిని కూల్ గా చేసుకుంటూ వెళ్లడమే ఆయనకి తెలుసు. అలాంటి వినాయక్ తదుపరి ప్రాజెక్టు ఏంటి? అనే ప్రశ్నకి సమాధానమైతే కనిపించడం లేదు. చిరంజీవి ఒక ప్రాజెక్టును ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా ప్రచారమైతే జరుగుతుందిగానీ, అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరి వినాయక్ నుంచి నెక్స్ట్ రాబోయే సినిమా ఏమిటో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్