Saturday, January 18, 2025
Homeసినిమాపవర్ స్టార్ మూవీలో వినాయక్!

పవర్ స్టార్ మూవీలో వినాయక్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్, హరి హర వీరమల్లు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ – దగ్గుబాటి రానా కాంబినేషన్ లో రూపొందుతోన్న అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కి యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిసింది. లాక్ డౌన్ ముందు జరిగిన షూటింగ్ లో వినాయక్ పై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించారని సమాచారం. పవన్ కళ్యాణ్  సినిమాకు దర్శకత్వం వహించాకపోయినా పవన్ సినిమాలో వినాయక్ ఓ పాత్ర పోషిస్తుండడం విశేషం.

గతంలో వినాయక్.. ఠాగూర్, అదుర్స్, ఖైదీ నెంబర్ 150, నేనింతే.. చిత్రాల్లో కనిపించారు. ఆమధ్య వినాయక్ ప్రధాన పాత్రలో శీనయ్య అనే సినిమా ప్రారంభం అయ్యింది. దీనికి నరసింహారావు దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. కొంత టాకీ పార్ట్ షూటింగ్ చేసిన తర్వాత కొన్ని కారణాల వలన ఈ సినిమాని ఆపేశారు. ఇక దర్శకుడిగా లూసిఫర్ రీమేక్ ని డైరెక్ట్ చేయాలి అనుకున్నారు కానీ.. లాస్ట్ మినిట్ లో వినాయక్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం వినాయక్.. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ఛత్రపతి మూవీ బాలీవుడ్ రీమేక్ ని డైరెక్ట్ చేస్తున్నారు. కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్