Thursday, March 19, 2026
Homeసినిమావైజయంతీ మూవీస్ వార్నింగ్ ఎవరికి.?

వైజయంతీ మూవీస్ వార్నింగ్ ఎవరికి.?

వైజయంతీ మూవీస్ సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన చేసింది. అందులో ఏమని రాసుందంటే…’జగదేకవీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ కానీ.. ప్రీక్వెల్ కానీ.. సీన్స్ రీ క్రియేట్ చేయడం కానీ.. కనీసం ఆ కథ ఆధారంగా మరో కథను రాసుకోవడానికి కూడా వీల్లేదని.. అలా చేస్తే లీగల్ గా చర్యలు తప్పవు అని రాసుంది.  ఇలా వైజయంతీ సంస్థ వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. ఇంత సడన్ గా ఇలా వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఏంటి అనేది ఆసక్తిగా మారింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అయితే.. ఈ వార్నింగ్ వెనకున్న అసలు స్టోరీ ఏంటని కాస్త ఆలోచిస్తే తెలిసింది ఏంటంటే.. చిరంజీవి హీరోగా దర్శకుడు మల్లిడి వశిష్ట్ తో ఓ సినిమా ప్లానింగ్ లో ఉంది. ఈ చిత్రాన్ని యు.వీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనుంది. ఇటీవల ఈ మూవీని ప్రకటించారు. కాన్సెప్ట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ను బట్టి ఇందులో పంచభూతల నేపథ్యంలో ఈ కథ ఉంటుందని తెలిసింది. అలాగే ఈ చిత్ర దర్శకుడు వశిష్ట్.. ఇది సోషియో ఫాంటసీ మూవీ అని.. జగదేకవీరుడు అతిలోక సుందరి తరహాలో ఈ సినిమా ఉంటుందని చెప్పారు.

అందుకనే వైజయంతీ సంస్థ ఇలా వార్నింగ్ ఇచ్చిందని.. వార్తలు వస్తున్నాయి. చిరంజీవి 156 చిత్రం కళ్యాణ్ కృష్ణతో చేయాలి అనుకున్నారు. అది బ్రో డాడీ రీమేక్ కావడం.. భోళాశంకర్ రీమేక్ తర్వాత చిరు ఆలోచన మారడంతో ఆ సినిమాని పక్కనపెట్టారు. ఇప్పుడు 157 చిత్రాన్ని మల్లిడి వశిష్ట్ తో చేద్దామని ఫిక్స్ అయ్యారు. అయితే.. ఇప్పుడు వైజయంతీ సంస్థ వార్నింగ్ ఇచ్చింది మల్లిడి వశిష్ట్ కే అని టాక్ వినిపిస్తోంది. నిజంగా వశిష్ట్ తయారు చేసుకున్న కథ జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రానికి దగ్గర ఉంటే కనుక ఇబ్బందులు తప్పవు. మరి.. ఏం జరగనుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular