Sunday, January 19, 2025
Homeసినిమా'వాల్తేరు వీరయ్య' నెక్ట్స్ అప్ డేట్ ఇదే

‘వాల్తేరు వీరయ్య’ నెక్ట్స్ అప్ డేట్ ఇదే

చిరంజీవి, బాబీ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ చిత్రంలో శృతిహాసన్ నటిస్తుంది. రవితేజ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇందులో చిరంజీవి ఊర మాస్ లుక్ లో కనిపిస్తుండడంతో మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు వాల్తేరు వీరయ్య థియేటర్లోకి వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇటీవల టీజర్ రిలీజ్ చేశారు దీనికి అనూహ్య స్పందన వచ్చింది. ఆతర్వాత ‘పార్టీ సాంగ్’ అంటూ ఓ పాట రిలీజ్ చేశారు. ఈ పాట యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. ఇప్పుడు నుంచి మరో ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఇచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ ఏంటా ఇంట్రస్టింగ్ అప్ డేట్ అంటే… రవితేజ పై ఇంట్రెస్టింగ్ ట్రీట్ ని ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. నిజానికి కాస్త ముందే రావాల్సి ఉన్న ఈ ట్రీట్ ని మేకర్స్ నెక్స్ట్ వీక్ లో ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం.

ఈ చిత్రంలోని రవితేజ పాత్రని పరిచయం చేస్తూ ఓ అనౌన్సమెంట్ టీజర్ ని రిలీజ్ చేస్తారట. ఈ టీజర్ అందరికీ బాగా కనెక్ట్ అయ్యేలా రెడీ చేశారని తెలిసింది. ఈ టీజర్ తర్వాత మరో సాంగ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇలా… వాల్తేరు వీరయ్య పక్కా ప్లాన్ తో ప్రమోషన్స్ చేస్తున్నాడు. సంక్రాంతికి రెండు తెలుగు స్ట్రైయిట్ మూవీస్ తో పాటు రెండు తమిళ చిత్రాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈవిధంగా బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఉంది. అందుచేత ప్రమోషన్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. మరి.. ప్లాన్ వర్కవుట్ అయి బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ విజేతగా నిలుస్తారా..? సరికొత్త రికార్డులు సెట్ చేస్తారా..? అనేది ఆసక్తిగా మారింది.

Also Read : Chiranjeevi: మెగాస్టార్ కు అరుదైన పురస్కారం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్