Sunday, January 19, 2025
Homeసినిమావాల్తేరు వీరయ్య సాంగ్ కి రెస్పాన్స్ అదిరింది.

వాల్తేరు వీరయ్య సాంగ్ కి రెస్పాన్స్ అదిరింది.

చిరంజీవి, బాబీ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ, క్రేజీ మూవీ ‘వాల్తేరు వీరయ్య‘. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. రవితేజ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ‘అన్నయ్య’ సినిమాలో చిరంజీవి, రవితేజ కలిసి నటించారు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలిసి సినిమా చేస్తుండడంతో వాల్తేరు వీరయ్య సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రేజీ మూవీకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వస్తుందా అని ఎదురు చూసిన అభిమానుల కోసం ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఇలా రిలీజ్ చేశారో లేదో అలా ఈ సాంగ్ యూబ్యూబ్ ని షేక్ చేస్తుంది. అదిరే మాస్ బీట్స్ తో ఇన్ స్టాంట్ చార్ట్ బస్టర్ అయ్యింది. మరి డీజే వీరయ్యగా మారి అదరగొట్టిన ఈ సాంగ్ అయితే కేవలం 14గంటల్లోనే 7 మిలియన్ వ్యూస్ ని అందుకొని దూసుకెళ్తుంది. సీనియర్ హీరోస్ లో అయితే ఇదో ఫాస్టెస్ట్ రికార్డు అని కూడా చెప్పొచ్చు. మొత్తానికి అయితే ఫస్ట్ సాంగ్ తో మేకర్స్ మంచి రెస్పాన్స్ ని అందుకున్నారు. ఇక ఈ స్పెషల్ సాంగ్ లో ఊర్వశి రౌటెలా కనిపించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.

ప్రమోషన్స్ ను ఇక నుంచి ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట. గాడ్ ఫాదర్ మూవీకి ప్రమోషన్స్ చేయడంలో కాస్త ఆలస్యం అవ్వడం.. దీని పై విమర్శలు రావడం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా విషయంలో అలా జరగకుండా చూసుకుంటున్నారు. ప్రమోషన్స్ ను గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఇప్పటి వరకు సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అని ప్రకటించారు కానీ.. రిలీజ్ ఎప్పుడు అనేది అనౌన్స్ చేయలేదు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

Also Read : వాల్తేరు వీరయ్య’ సెట్ లో ‘బాస్ పార్టీ సాంగ్’ వీక్షించిన పవన్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్