Saturday, January 18, 2025
Homeసినిమాటీజర్ తో అదరగొట్టిన వాల్తేరు వీరయ్య

టీజర్ తో అదరగొట్టిన వాల్తేరు వీరయ్య

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ ఓ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్న. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో, చిరంజీవి సరసన శ్రుతి హాసన్ అలరించనుంది. కెరియర్ పరంగా చిరంజీవికి ఇది 154వ సినిమా. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య‘ అనే టైటిల్ ను ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. దీపావళి కానుకగా అదే టైటిల్ ను ఖరారు చేస్తూ, టైటిల్ పోస్టర్ తో పాటు టైటిల్ టీజర్ ను రిలీజ్ చేశారు.

ఇక టీజర్ విషయానికి వస్తే… వీరయ్య తనని సవాల్ చేసిన వారికి తనదైన స్టైల్లో సమాధానం చెప్పడమనే ఒక యాక్షన్ సీన్ పై ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. రంగు బనీను పై పూల చొక్కా .. పైకి కట్టిన లుంగీ .. చెవికి రింగులు .. మెళ్లో బంగారు చైన్లు .. ఒక చేతికి బంగారు కడియం .. మరో చేతికి గోల్డ్ వాచ్ .. బ్లాక్ స్పెట్స్ తో కనిపిస్తూ .. బీడీ దమ్ము కొడుతూ చిరంజీవి మాస్ లుక్ తో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో వీరయ్యకి యూ ట్యూబ్ వీడియోస్ చేసే అలవాటు ఉందనే విషయాన్ని ఈ టీజర్ ద్వారా రివీల్ చేశారు.

రౌడీలను కొట్టేసిన వీరయ్య .. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ .. షేర్ .. అండ్ సబ్ స్క్రైబ్  చేయండి అంటూ లైవ్ లోనే వీడియో చేసేయడం చూపించారు. ఈ టీజర్ లో చిరంజీవి లుక్ చూస్తుంటే.. ‘ముఠామేస్త్రి,’ రౌడీ అల్లుడు టైమ్ లో చిరంజీవి ఎలా కనిపించారో అచ్చు అలాగే కనిపించారు. దీంతో ఈ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో 6 మిలియన్స్ కు పైగా వ్యూస్ తో దూసుకెళుతుంది. ఇంకా చెప్పాలంటే.. ఇప్పటి వరకు  వాల్తేరు వీరయ్య సినిమా పై ఉన్న అంచనాలను ఈ టీజర్ రెట్టింపు చేసిందని చెప్పచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి.. వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ ని షేక్ చేస్తాడేమో చూడాలి.

Also Read : ప్రతి పండుగకు ఒక మూవీ విడుదల 

RELATED ARTICLES

Most Popular

న్యూస్