Sunday, January 19, 2025
Homeసినిమావాల్తేరు వీరయ్య అంతకు మించి ఉంటుంది - చిరంజీవి

వాల్తేరు వీరయ్య అంతకు మించి ఉంటుంది – చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ మాస్ యాక్షన్ మూవీ వాల్తేరు వీరయ్య. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ప్రకటించినప్పటి నుంచి మెగా అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టు ఈ సినిమా టీజర్ అండ్ సాంగ్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో వాల్తేరు వీరయ్య పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి కానుకగా జనవరి 13న వాల్తేరు వీరయ్య చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అయితే.. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వాల్తేరు వీరయ్య టీమ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్ మీట్ లో చిరంజీవి వాల్తేరు వీరయ్య గురించి మాట్లాడుతూ.. మనల్ని అభిమానించేవారు డైరెక్టర్ అయితే .. ఆ డైరెక్టర్ తో తప్పకుండా సినిమా చేయి .. వాళ్లు చూపించినట్టుగా మనల్ని ఎవరూ చూపించలేరని అని ఒక సీనియర్ హీరో నాతో చెప్పారు. ఆ మాట నాలో బలంగా నాటుకుపోయింది. బాబీని చూసిన తరువాత అది నిజమేనని నాకు అర్థమైంది అన్నారు చిరంజీవి. ఈ సినిమా రెగ్యులర్ స్టోరీగా ఉండచ్చు కానీ.. ఇందులో ఓ మంచి పాయింట్ ఉంది అన్నారు.

అంతే కాకుండా.. వాల్తేరు వీరయ్య సినిమా గురించి ఎవరు ఎన్ని అంచనాలతో వచ్చినా.. అంతకు మించి అనేలా వాల్తేరు వీరయ్య సినిమా ఉంటుందని చిరంజీవి చెప్పారు. శేఖర్ మాస్టర్ నా స్టైల్ పూర్తిగా పట్టేశాడనే విషయం నాకు అర్థమైంది. ప్రతి ఒక్కరూ ఎంతో అంకితభావంతో చేసిన ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి. ఆయన ఇలా మాట్లాడడంతో వాల్తేరు వీరయ్య పై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. మరి.. బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్స్ సాధిస్తాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్