భవిష్యత్‌లో అందరి సహకారంతో వనపర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో పల్లె నిద్రలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి వజ్ర సంకల్పంలో భాగంగా సామూహిక పల్లెనిద్రలో ఆముదంబండ తండా, గార్లబండ తండాలో మంత్రి పల్లె నిద్ర చేశారు. ఈ రోజు (గురువారం) ఉదయం మార్నింగ్ వాక్ చేసి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..50 చోట్ల ప్రభుత్వ అధికారులతో పల్లెనిద్రలు చేయడం అనేది ఒక గొప్ప సందర్భానికి నాంది అన్నారు. గత ఎనిమిదేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. సాగు నీరు అందించి పంటల సాగును ప్రోత్సహించామన్నారు.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పంటలు కొనుగోలు చేశామని గుర్తు చేశారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామన్నారు. మా ఆలోచనలను ప్రజలు స్వాగతించారు. ఊరూరా వచ్చిన స్పందన ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. రానున్న రోజుల్లో అన్ని గ్రామాల్లో పల్లె నిద్రలు చేస్తామని మంత్రి తెలిపారు. మంత్రి వెంట స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
Also Read : త్వరలో కోహెడ ఫ్రూట్ మార్కెట్ తుది లే అవుట్