Saturday, January 18, 2025
Homeసినిమా'War' Date: 'వార్ 2' రిలీజ్ డేట్ ఫిక్స్!

‘War’ Date: ‘వార్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్!

సినిమా నిర్మాణం పూర్తి కాకముందే రిలీజ్ డేట్ ప్రకటించడం కొన్నాళ్ళుగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఆసలు మొదలు పెట్టకముందే రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పేయడం లేటెస్ట్ ట్రెండ్.  ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో రానున్న ‘వార్ 2’ ను బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించనున్నారు. ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువస్తారా అని ఎన్టీఆర్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ లో సెట్స్ పైకి రానుంది.

అయితే..ఇంకా సెట్స్ పైకి రాకుండానే ‘వార్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. 2025లో రిపబ్లిక్ డే రోజు జనవరి 26న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారట. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ చేస్తున్నారు. కొరటాల డైరెక్షన్ లో రూపొందుతోన్నఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఎన్టీఆర్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్,  విలన్ గా బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్, సైఫ్ ఆలీఖాన్ ల మధ్య యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు

ఈ సినిమాని నవంబర్ కి పూర్తి చేసి డిసెంబర్ నుంచి వార్ 2 షూటింగ్ లో జాయిన్ కావడానికి ప్లాన్ చేస్తున్నారు. వార్ 2 లో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. జైలవకుశలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర పోషించారు. ఇందులో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని.. ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని టాక్. ఈ సినిమాతో బాలీవుడ్ లో ఎన్టీఆర్ కు మరింత క్రేజ్ పెరగడం ఖాయమని ఇప్పటి నుంచే వార్తలు వస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్