Sunday, January 19, 2025
HomeTrending Newsతెరాసతో పొత్తు ఉండదు - రాహుల్ గాంధి

తెరాసతో పొత్తు ఉండదు – రాహుల్ గాంధి

Warangal Rythu Declaration : ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజాస్వామికంగా వ్యవహరించటం లేదని ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఓ రాజ్యానికి రాజు మాదిరిగా తనక నచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ప్రజాస్వామ్య సూత్రాలు పాటించటం లేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల మాట వినకుండా ఒకరిద్దరు ఉన్నతాధికారులు చెప్పినట్టుగా నడుచుకుంటున్నారని ఆరోపించారు. హన్మకొండలో ఈ రోజు జరిగిన రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో తెరాస పాలనపై రాహుల్ గాంధి ధ్వజమెత్తారు. హన్మకొండ సభలో ప్రకటించింది రైతు డిక్లరేషన్ కాదని తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ గ్యారంటీ ఇస్తోందని రాహుల్ గాంధి భరోసా ఇచ్చారు. రైతు డిక్లరేషన్ తెలంగాణ రైతాంగానికి పునాది లాంటిదన్నారు. రైతాంగానికి రెండు లక్షల రుణ మాఫీ చేస్తామని చెప్పారు.

తెలంగాణకు ద్రోహం చేసింది ఎవరు. తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు, మోసం చేస్తున్నది ఎవరు అని సభికులని రాహుల్ అడిగారు. అందుకు బదులుగా సభలో ఉన్న వారు కెసిఆర్ అని గట్టిగా అరిచారు. తెలంగాణను మోసం చేసిన వారితో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటూ సంబంధాలు, పొత్తులు ఉండవని రాహుల్ గాంధి స్పష్టం చేశారు. తెరాస తో పొత్తు దిశగా కాంగ్రెస్ నేత ఎవరు ప్రయత్నించినా.. వారు ఎంతటి వారైనా పార్టీ నుంచి బహిష్కరిస్తాం. తెరాస, బిజెపి తో పొత్తు కావాలనుకునే నేతలు ఆ పార్టీలోకి వెళితే ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు. తెలంగాణ ఏ ఒక్కరి వల్ల రాలేదని, ఒక్కరి కోసమే తెలంగాణ ఏర్పడలేదన్నారు. ఎంతో మంది త్యాగాలతో తెలంగాణ వచ్చిందని అయితే తెలంగాణ వల్ల ఒకే కుటుంబం బాగుపడిందని విమర్శించారు.

రాబోయే ఎన్నికల్లో తెరాస పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని రాహుల్ పిలుపు ఇచ్చారు. హన్మకొండ సభ సాక్షిగా తెలంగాణ ప్రాంతానికి నష్టం చేసిన వారిని వదిలిపెట్టేదిలేదని హెచ్చరించారు. ప్రజల్లో ఉంది ప్రజల కోసం పనిచేసేవారికే కాంగ్రెస్ తరపున పోటీ చేసే అవకాశం కల్పిస్తామని రాహుల్ స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రత్యక్షంగా అధికారంలోకి రామనే సంగతి బిజెపి నేతలకు తెలుసనీ, అందుకే రిమోట్ ద్వారా తెరాస తో వారు అనుకున్నది చేస్తున్నారని రాహుల్ విమర్శించారు. పార్లమెంటులో బిజెపి నల్ల చట్టాలు తీసుకొస్తే తెరాస నేతలు స్పందించలేదన్నారు. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తామని రాహుల్ వెల్లడించారు. తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలపై పోరాడేందుకు ఎప్పుడు పిలిచినా వస్తానని, ఇది ఒక తెలంగాణ యువత, రైతులు ఉద్యోగుల పోరాటం కాదని వారి తరపున కాంగ్రెస్ పార్టీ తలపడుతుందని రాహుల్ భరోసా ఇచ్చారు.

Also Read : విద్యార్థి నాయకుల పరామర్శకు రాహుల్ గాంధి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్