Tuesday, March 25, 2025
HomeTrending Newsసూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిధుల విడుదల

సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిధుల విడుదల

Warangal Super Specialty Hospital :

వరంగల్ హెల్త్ సిటీ ఏర్పాటులో భాగంగా వరంగల్ కేంద్ర కారాగారం స్థలంలో నిర్మించ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి 11 వందల కోట్ల రూపాయల పరిపాలనా అనుమతులు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జీ ఓ జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్. ఎ. ఎం. రిజ్వీ, జీ ఓ 158 ని జారీ చేశారు. ఇందులో సివిల్ వర్క్స్ కి 509 కోట్లు, మంచినీరు, పారిశుద్ధ్యం కోసం 20.36 కోట్లు, మెకానికల్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ పనుల కోసం 182.18 కోట్లు, వైద్య పరికరాల కోసం 105 కోట్లు, అనుబంధ పనుల కోసం 54.28 కోట్లు, చట్టబద్ధమైన పనులు, పన్నుల కోసం 229.18 కోట్ల నిధుల కోసం అనుమతులు ఇచ్చారు. Tsmsidc, dme ఆధ్వర్యంలో వెంటనే పనులు చేపట్టాలని రిజ్వి ఆ జీ ఓ లో అదేశించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్