Wednesday, March 26, 2025
HomeTrending NewsBabu: ప్రాజెక్టుల పరిశీలనకు బాబు, కర్నూలులో ఘన స్వాగతం

Babu: ప్రాజెక్టుల పరిశీలనకు బాబు, కర్నూలులో ఘన స్వాగతం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ‘పెన్నా టు వంశధార’ పేరుతో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు బయల్దేరారు. నేటి నుంచి 10వ తేదీ వరకూ పదిరోజులపాటు ఆయన ప్రాజెక్టులను సందర్శించి వాటి నిర్మాణ స్థితిగతులను పరిశీలిస్తారు. గత ఐదేళ్ళ కాలంలో చేసిన వ్యయం తో పాటు ఈ నాలుగేళ్ళలో జగన్ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మీడియాకు ప్రజలకు వివరించనున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో రోడ్ షో, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. నేడు నందికొట్కూరులో జరిగే సభలో బాబు పాల్గొంటారు. రేపు గండికోట ప్రాజెక్టు టూర్ అనంతరం పులివెందుల సభలో ఆయన ప్రసంగించనున్నారు.

పదిరోజుల యాత్రలో భాగంగా  హైదరాబాద్ నుంచి బయల్దేరి కర్నూలు చేరుకున్న చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్