Monday, March 17, 2025
HomeTrending NewsHail storm:తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్

Hail storm:తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్

తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ రోజు నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగళ్ల తుఫాన్ కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఉత్తర కర్ణాటక మీదుగా కొనసాగుతున్న ఉపరితల అవర్తనం ప్రభావంతో  రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈరోజు వడగళ్ళు మరియు ఈదురు గాలులు గాలి వేగం గంటకు 40 నుండి 50 కి మీ వేగంతో వీచే అవకాశం ఉన్న జిల్లాల వివరాలని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలు ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్